అంతర్వేది ఘటనపై అంతర్గత కమిటీ 

7 Sep, 2020 08:25 IST|Sakshi
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అస్మీ

రెండు మూడు రోజుల్లో నివేదిక

కలెక్టర్‌ ఆదేశాలు 

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి రథం దగ్ధం ఘటనపై జిల్లా యంత్రాంగం అంతర్గత విచారణకు ఆదేశించింది. సంఘటనకు దారి తీసిన పరిస్థితులు, బాధ్యులు ఎవరు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలపై సూచనలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. అమలాపురం సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్, జిల్లా అగి్నమాపక అధికారి రత్నకుమార్, అదనపు ఎస్పీ కరణం కుమార్, అంతర్వేది ఆలయ ఈఓ చక్రధరరావులతో ఈ కమిటీ ఏర్పాటైంది. నాలుగైదు రోజుల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. (చదవండి: అంతర్వేది ఆలయ రథం దగ్ధం)

ఈ సంఘటనలో కుట్ర కోణం ఉన్నట్లుగా ఎక్కడా ప్రాథమిక ఆధారాలు లభించలేదన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి కొంతకాలంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ, చెత్తను పోగు చేసి మంట పెడుతున్నట్టు గుర్తించారు. రథం దగ్ధం సంఘటన జరిగిన శనివారం రాత్రి ఆ వ్యక్తి మంటలు.. మంటలు.. అంటూ కేకలు వేస్తూ వెళ్లాడని అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనలో కుట్రకోణం ఏమీ లేదని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఒకటి రెండు రోజుల్లో ఒకపక్క పోలీసులు, మరోపక్క రెవెన్యూ అధికారులు ఈ మిస్టరీని ఛేదించనున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ధ్రువీకరించారు. (చదవండి: కూతురు ఫోన్‌ రికార్డుతో బయటపడ్డ మర్డర్‌ స్కెచ్‌)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా