జనవరి 6 నుంచి అంతర్జాతీయ తెలుగు సంబరాలు

8 Dec, 2021 15:38 IST|Sakshi

సాక్షి, కాళ్ల: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో ఆంధ్ర సారస్వత పరిషత్‌ (భీమవరం) ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు నిర్వహిస్తున్నట్టు పరిషత్‌ పాలకమండలి చైర్మన్‌ గజల్‌ శ్రీనివాస్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. పెదఅమిరంలోని వెస్ట్‌బెర్రీ హైస్కూల్‌ గ్రౌండ్‌ ప్రాంగణంలో సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ముందుగా జనవరి 3న భీమవరంలో తెలుగు భాష వైభవ శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు. జనవరి 6న ప్రాచీన కవులు, రాజవంశీయుల కుటుంబీకులకు ఆంధ్ర వాయ పూర్ణకుంభ పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. 

జనవరి 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగింపు సభ, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చే వారికి ఎలాంటి ప్రవేశ రుసుం లేదని, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత వసతి, రవాణా, భోజన సదుపాయం కల్పిస్తామని జిల్లా ఉత్సవ కమిటీ నేతలు తెలిపారు. విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు రాయప్రోలు భగవాన్, కేశిరాజు రామ్‌ప్రసాద్, భట్టిప్రోలు శ్రీనివాస్, బి.రాంబాబు, లక్ష్మణ వర్మ, మంతెన రామ్‌కుమార్‌ రాజు, మేడికొండ శ్రీనివాస చౌదరి, జ్యోతి రాజ్, ఒడుపు గోపి, మహేష్‌ పాల్గొన్నారు. (చదవండి: 12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు)

మరిన్ని వార్తలు