వీఐటీఏపీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలు!

10 Mar, 2021 13:52 IST|Sakshi

అమరావతి: వీ.ఐ.టీ.ఏ.పీ  విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్చవల్‌ విధానంలో ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ‘‘వ్యాక్సిన్ గాడ్ మదర్ ఆఫ్ ఇండియా’’ డైరెక్టర్‌ డాక్టర్‌ గగన్ దీప్ కాంగ్, ప్రొఫెసర్ మరియు లాబరేటరీ డైరెక్టర్, వెల్కమ్ ట్రస్ట్ రీసెర్చ్ లాబరేటరీ, సి.ఎం.సి. వెల్లూరు గౌరవ అతిధిగా, (వీఐఈసీఈ 1991 బ్యాచ్ పూర్వ విద్యార్థిని) సీనియర్‌ డైరెక్టర్, ఒరాకిల్ కార్పొరేషన్, యు.ఎస్.ఏ.. శైలజ మలిరెడ్డి హజరయ్యారు.

కాగా, ముఖ్యఅతిథిగా హజరైన గగన్ దీప్ కాంగ్మామాట్లాడుతూ.. అంటూ వ్యాధులు, వ్యాధి నిరోధక టీకాల గురించి వివరించారు. ప్రస్తుతం మరియు భవిష్యత్ లలో వ్యాధుల వ్యాప్తిలో జరిగే మార్పులు గురించి తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో వ్యాధులు అతి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని దీనికి జనాభా పెరుగుదల ఇతర కారణాలు దోహదం చేస్తున్నాయని అన్నారు.

ఎయిడ్స్, జిక, ఎబోలా, సార్స్, కోవిడ్ వంటి మహామ్మారులు ఎలా వ్యాప్తి చెందుతాయో, వ్యాధినిరోధక టీకాలతో వీటిని కట్టడిచేసి మరణాల రేటుని ఎలా తగ్గించావచ్చో, వివిధ వ్యాధి నిరోదోక టీకాల పనితీరు, అభివృద్ధి, భవిష్యత్ తరాలకు అవి ఉపయోగపడే విధానాల గురించి  వివరించారు. గౌరవఅతిధి శ్రీమతి. శైలజ మలిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో వి.ఐ.టి.లో గడిపిన క్షణాలను గుర్తు చేస్తుకున్నారు.

విద్యతోనే మహిళా అభివృద్ధి సాధ్యమని, జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవటానికి ప్రతి మహిళా కృషి చేయాలనీ తెలియచేస్తూ, సామజిక సేవా రంగంలో తను చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా వివరించారు.వి.ఐ.టి.ఏ.పి విశ్వవిద్యాలయ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్‌ సంధ్య పెంటారెడ్డి మాట్లాడుతూ మహిళల సమన హక్కులు , వరకట్న నిషేధం, లింగ మరియు ఆర్థిక అసమానతలు, మహిళల్లో బహుళ సామర్థ్యం గురించి  చక్కటి ప్రజెంటేషన​ ద్వారా వివరించారు.

వి.ఐ.టి. ఫౌండర్ మరియు ఛాన్సలర్ డాక్టర్‌ జి.విశ్వనాథన్  మాట్లాడుతూ...  అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధి, గౌరవ అతిధులను కొనియాడారు. ఆడపిల్లగా పుట్టడం అదృష్టమని, ప్రపంచ జనాభాలో 49.9 శాతం  మంది మాత్రమే మహిళలు ఉన్నారని, అదే భారత దేశంలో కేవలం 48.4 శాతం మంది మాత్రమే ఉన్నారని తెలియచేసారు. మహిళా సాధికారికత, రాజకీయాలలో మహిళల పాత్ర గురించి వివరించారు.మహిళలు ఉన్నత విద్యలో రాణించేందుకు యూనివర్సిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (University Higher Education Trust) ద్వార సహాయం అందిస్తున్నామని తెలిపారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అనేక పోటీలలో విజేతలుగా నిలచిన విద్యార్థులకు, సిబ్బంది మరియు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వి.ఐ.టి.ఏ.పివిశ్వవిద్యాలయవైస్‌ ప్రెసిడెంట్ డాక్టర్‌ శేఖర్ విశ్వనాథన్, వైస్ ఛాన్సలర్‌ ఎస్.వి. కోటా రెడ్డి , రిజిస్ట్రార్‌ సి.యల్.వి. శివకుమార్, స్టూడెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనుపమ నంబూరు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, వీ.ఐ.టీ.ఏ.పీ విశ్వవిద్యాలయంలో 30 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉండడం విశేషం.

మరిన్ని వార్తలు