అంగలకుదురులో టీడీపీ నేతల అనుచిత ప్రవర్తన

11 Feb, 2021 10:15 IST|Sakshi

చంద్రబాబు, ఆలపాటి ఫొటోలతో సచివాలయ ప్రవేశం 

తెనాలి/ తెనాలిరూరల్‌: గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌ మండల గ్రామం అంగలకుదురులో టీడీపీ మద్దతుదారు విజయం సాధించటంతో ఆ పార్టీకి చెందిన కొందరు అవాంఛనీయంగా ప్రవర్తించారు. గ్రామ సచివాలయ బోర్డుపై దాడి చేశారు. బోర్డుపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మను కనిపించకుండా చేయాలన్న కసితో ఆ పనిచేసినట్టుగా అర్థమవుతోంది. సర్పంచ్‌ పదవికి ఎన్నికయ్యాక సర్పంచ్, ఉపసర్పంచ్‌లు గృహప్రవేశం చేసినట్టుగా ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మరొకరు మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఫొటోలతో సహా సచివాలయంలోకి ప్రవేశించారు.

వీరిని ఆ పార్టీ నేతలు అనుసరించారు. గ్రామంలో ఇదే అభ్యర్థులు నామినేషను దాఖలు రోజున టీడీపీ కండువాలు, జెండాలు ధరించి ఊరేగింపు చేసిన విషయం తెలిసిందే. గెలిచాక తమ అక్కసును సచివాలయం బోర్డుపై తీర్చుకున్నారు. దీనిపై స్థానికులు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఫ్లెక్సీ ధ్వంసంపై పోలీసులు కేసు నమోదు  చేసినట్టు రూరల్‌ ఎస్‌ఐ ఎం. మురళి తెలిపారు.
(చదవండి: నామినేషన్‌ వేస్తే చంపేస్తాం!)
కోరి తెచ్చుకుంటే కొంప ముంచాయి!

మరిన్ని వార్తలు