జగనన్న పాలనపై వ్యాసాలకు ఆహ్వానం

20 Dec, 2021 10:15 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాహసోపేత నిర్ణయాలతో జరుగుతున్న జన రంజక పాలనపై వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమం, వాలంటీర్ల వ్యవస్థ, రైతుభరోసా, ఆరోగ్యశ్రీ,  ఆరోగ్య ఆసరా, వాహనమిత్ర, వసతి దీవెన, విద్యా దీవెన... ఇలా ప్రభుత్వ పనితీరులో చోటుచేసు కున్న మార్పులను విశ్లేషించాలి.

చదవండి: ప్రజాదరణ చూసి ఓర్వలేక కుట్రలు

మీ వ్యాసం సరళమైన తెలుగులో, 500–800 పదాల మధ్య ఉండాలి. వాట్సప్‌లో లేదా పేజ్‌ మేకర్‌ 7.0 లేదా యూనికోడ్‌లో టైపు చేసిన  ఓపెన్‌ డాక్యుమెంట్లు మాత్రమే పంపించాలి. బహుమతులకు ఎంపికైన 20 వ్యాసాలే కాక మంచి విశ్లేషణ గల మరో 20 వ్యాసాలను కలిపి పుస్తకంగా ప్రచురిస్తాం. మొదటి (రూ.10 వేలు), రెండు (రూ.5 వేలు), మూడు (రూ.3 వేలు), నాలుగు (రూ.2 వేలు), ఐదు (రూ.1000) బహుమతులతోపాటు ప్రచురించిన ప్రతి వ్యాసానికీ రూ. 1000 ఇస్తాం. బహుమతి ప్రదానం పుస్తకావిష్కరణ రోజే ఉంటుంది. వ్యాసాలు పంపడానికి ఆఖరు తేదీ: 2022 ఏప్రిల్‌ 30. పంపాల్సిన వాట్సాప్‌ నంబర్‌: 9393111740. ఈ–మెయిల్‌: srdalitsocialmedia@gmail.com
– డా.జి.కె.డి.ప్రసాద్, వైఎస్‌ఆర్‌ దళిత్‌ సోషల్‌ మీడియా, విశాఖపట్నం 

మరిన్ని వార్తలు