దత్త పీఠాధిపతి పుట్టిన రోజు వేడుకలకు సీఎం జగన్‌కు ఆహ్వానం

10 May, 2022 10:29 IST|Sakshi
సీఎం జగన్‌కు ఆహ్వాన పత్రిక అందిస్తున్న దత్త పీఠం ప్రతినిధులు, వైవీ సుబ్బారెడ్డి 

సాక్షి, అమరావతి: అవదూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ 80వ పుట్టిన రోజు వేడుకలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దత్తపీఠం ప్రతినిధులు ఆహ్వానించారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన దత్తపీఠం ప్రతినిధులు ఆహ్వాన పత్రాన్ని అందించారు. సీఎంను కలిసిన వారిలో దత్తపీఠం ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీ హెచ్‌వీ ప్రసాద్, ట్రస్టీ రమేష్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తదితరులున్నారు.
చదవం‍డి: ఏది నిజం: రోడ్లపై గుంతలా? రామోజీ కళ్లకు గంతలా? 

మరిన్ని వార్తలు