ఈఎన్‌సీ చీఫ్‌తో ఇరాన్‌ నేవీ బృందం భేటీ

20 May, 2022 05:47 IST|Sakshi
ఈఎన్‌సీతో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ నేవీ బృందం

దొండపర్తి (విశాఖ దక్షిణ): ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ నేవీ ట్రైనింగ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ కమడోర్‌ ఫరామర్జి నసిరితో పాటు నలుగురు సభ్యుల బృందం గురువారం తూర్పు నావికాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ వాత్సాయన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈఎన్‌సీలో వివిధ శిక్షణా కేంద్రాల పనితీరును ఆ బృందం సభ్యులకు వివరించారు.

ఇరుదేశాల నావికాదళ సిబ్బంది శిక్షణకు సంబంధించిన అంశాలపై సహకారం అందించుకునే విషయంపై చర్చించుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 16న తూర్పు నావికాదళాన్ని సందర్శించిన ఇరాన్‌ నేవీ బృందం ఈఎన్‌సీలో శిక్షణా కేంద్రాల తీరుతెన్నులను పరిశీలించింది. 

మరిన్ని వార్తలు