నల్లమల ఘాట్‌లో కొండను ఢీకొన్న లారీ 

18 Aug, 2021 07:54 IST|Sakshi

డ్రైవర్‌ మృతి..

6 గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం 

ఆత్మకూరు: నల్లమల ఘాట్‌ ప్రాంతంలో కొండను లారీ ఢీకొన్న ఘటన మంగళవారం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్‌ విజయేంద్ర సింగ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్‌ లతన్‌ యోగి ఎడమకాలు విరిగి గాయాలయ్యాయి. రాజస్థాన్‌కి చెందిన లారీ విశాఖ నుంచి బళ్లారికి ఐరన్‌ షీట్లు తీసుకుని వెళుతోంది. దోర్నాల– ఆత్మకూరు నల్లమల ఘాట్‌లోని రోళ్లపెంట వద్ద మలుపు తిరిగే సమయంలో లారీ అదుపు తప్పి కొండను ఢీకొని రోడ్డుపై అడ్డుగా ఉండిపోయింది. దీంతో నల్లమలలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరు ఎస్‌ఐ హరిప్రసాద్, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ మృతదేహాన్ని, క్లీనర్‌ను బయటకు తీశారు. అనంతరం ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్‌ చేశారు.  


కొండను ఢీకొన్న ఐరన్‌షీట్‌ లారీ  
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు