‘అందుకే పోలవరం వద్ద పటిష్ట చర్యలు చేపట్టాం’

15 Jul, 2022 17:17 IST|Sakshi

ఏలూరు జిల్లా: వరద ఉధృతి కారణంగా పోలవరం వద్ద ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు తెలిపారు. శుక్రవారం పోలవరం వద్ద వరద ఉధృతిని పరిశీలించిన తర్వాత మీడియా మాట్లాడారు అంబటి రాంబాబు. 

‘30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే కాపర్ డ్యామ్ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. అందుకే పటిష్ట చర్యలు చేపట్టాం. ఇప్పటికే లోయర్ కాపర్ డ్యాం మునిగిపోవడంతో డయాఫ్రం వాల్ పైన వాటర్ ప్రవేశించడంతో పనులు నిలిచిపోయాయి.ఎగువ నుండి భారీ స్థాయిలో వరద నీటి ప్రవాహం రానున్నది. పోలవరం వద్ద 28 లక్షల క్యూసెక్కులు వచ్చినా అప్పర్  కాపర్ డ్యాం  తట్టుకోగలదు. అంతకంటే ఎక్కువైతే ఇబ్బందికర పరిస్థితి ఎర్పడుతుంది. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా ఎత్తు పెంచే ఎర్పాట్లు  చేపట్టాం’ అని అంబటి తెలిపారు.

మరిన్ని వార్తలు