ఉద్దానం పనస అధరహో! 

19 Mar, 2021 20:58 IST|Sakshi

కాశీబుగ్గ/వజ్రపుకొత్తూరు: ఉద్దానం పనసకు హోలీ గిరాకీ వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పనసకాయలకు డిమాండ్‌ ఉండటంతో ప్రతిరోజూ లారీల్లో కాయలను తరలిస్తున్నారు. ఈ నెల 28న హోలీ, వచ్చే నెల ప్రారంభంలో ఉగాది పండుగల నేపథ్యంలో ఈసారి కిలో పనసకాయల ధర ఎన్న డూ లేనివిధంగా మొదట్లో రూ.25 నుంచి రూ.35 వరకు ధర పలికింది. తాజాగా కిలో రూ.16 వరకు విక్రయిస్తు న్నారు. హోలీ తర్వాత కాయలకు డిమాండ్‌ పడిపోతుంది. ఈ నేపథ్యంలో ముందుగానే కాయలను చెట్ల నుంచి కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. పనసలో రెండు రకాలు ఉంటాయి.

అందులో ఖర్జూరం రకం కాయలను పండ్లు గా విక్రయించేందుకు చెట్లకే ఉంచేశారు. ముదిరితే పనికిరాని గుజ్జు రకం కాయలను మార్కెట్‌కు సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా సీతంపేట, పాలకొండ ఏజెన్సీలతో పాటు ఉద్దానం నుంచి పూండి, పలాస, హరిపురం, కవి టి, కంచిలి మార్కెట్‌కు ప్రతి రోజూ 350 టన్నుల వరకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి కాన్పూర్, కోల్‌కతా తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తున్నారు.  

విరగకాసిన పనస.. 
తిత్లీ తుఫాన్‌ వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న సమయంలో చెట్లన్నీ మళ్లీ పునర్వైభవం సంతరించుకుంటున్నాయి. దీంతో పనసకాయలు విరగకాస్తున్నాయి. బరంపురం, గుజరాత్, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో జరిగే పెళ్లిళ్లలో పనసకాయల వినియోగం ఎక్కువ. ముఖ్యంగా పచ్చళ్లకు, పకోడీలు తదితర ఆహార పదార్థాల్లో అధికంగా వాడుతుంటారు.  

మరిన్ని వార్తలు