8న ‘కృష్ణా’లో జగనన్న విద్యాకానుక ప్రారంభం

6 Oct, 2020 13:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ: జగనన్న విద్యాకానుక పథకాన్ని ఈ నెల 8న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ కృష్ణా జిల్లా పునాదిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘జగనన్న విద్యా కానుక ద్వారా 40 లక్షల మందికి పైగా విద్యార్ధులకి లబ్ది చేకూరుతుంది. జగనన్న విద్యాకానుక పథకానికి సుమారు 650 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నాం.  విద్యార్ధులకు ఇచ్చే ఈ కిట్‌లో యూనిఫారం, పుస్తకాలు, నోట్ బుక్స్, స్కూలు బ్యాగ్ ఇలా వివిధ రకాల వస్తువులని అందిస్తున్నాము. రాష్ట్రంలో విద్యాశాఖకి సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యతనిచ్చి జగనన్న గోరుముద్ద, అమ్మఒడి, నాడు-నేడు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. విద్యాశాఖలో సంక్షేమ పథకాల ద్వారా డ్రాప్ అవుట్స్‌ని తగ్గించడం, ప్రాథమిక స్ధాయి నుంచే అత్యుత్తమ విద్యని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. విద్యా శాఖలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో 2.5 లక్షల మందికి పైగా విద్యార్ధులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లో చేరారు. 90 శాతం ఎన్‌రోల్‌మెంట్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామ’ని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. (100 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు...?)

విద్యార్థులకు వరం: డిప్యూటీ సీఎం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు వరం.. జగనన్న విద్యా కానుక అని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు ఎన్నడూ ఇలాంటి కిట్లు ఇవ్వలేదని, 4 లక్షలకు పైగా గిరిజన విద్యార్థులకు విద్యా కానుక అందిస్తున్నామని చెప్పారు. ‘గిరిజన పిల్లలు కలలో కూడా ఊహించని పథకం ఇది. కార్పొరేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్ పెరిగేలా సీఎం జగన్ చేశారు. ప్రతి పేద విద్యార్థికి  రూ.1600 విద్యాకానుక ఇస్తున్నాం. గిరిజనులకు ఎన్నడూ లేని సదుపాయాలు, మధ్యాహ్న భోజనం, అమ్మ ఒడి ఇచ్చిన చరిత్ర సీఎం వైఎస్‌ జగన్‌కే సొంతమ’ని అన్నారు.

మరిన్ని వార్తలు