Fake Jalakanya Video: మైపాడు బీచ్‌లో జలకన్య? అసలు నిజం ఏంటంటే..

8 Nov, 2021 21:40 IST|Sakshi
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో దృశ్యం

సాక్షి, ఇందుకూరుపేట: ప్రముఖ పర్యాటక కేంద్రం మైపాడు బీచ్‌లో జలకన్య కలకలం అని వస్తున్న వార్తలో నిజం లేదని, ఇలాంటి వదంతులను నమ్మవద్దని ఆక్వా కోఆపరేటివ్‌ మార్కెట్‌  డైరెక్టర్‌ పామంజి నరసింహులు స్పష్టం చేశారు. మైపాడు బీచ్‌లో ఓ జలకన్య మత్స్యకారులకు చిక్కినట్లు సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ అయిన విషయంపై ఆయన స్పందించారు.

చదవండి: ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా గుర్రంపైనే.. 

ఇందుకూరుపేటలో ఆయన మాట్లాడుతూ, కొందరు ఆకతాయిలు ఓ వీడియోని సృష్టించి.. పది రోజుల కిందట కర్ణాటక రాష్ట్రంలో ఈ సంఘటన జరిగినట్లు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారన్నారు. తాజాగా గత నాలుగైదు రోజుల నుంచి ఇదే వీడియోలను మైపాడు బీచ్‌లో జరిగినట్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి.. లేనిది ఉన్నట్లు చూపుతున్నారని తెలిపారు. వీటిని పోస్టు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నరసింహులు కోరారు.
చదవండి: ఊర్లున్నాయి.. ప్రజలు లేరు! 

>
మరిన్ని వార్తలు