గత ప్రభుత్వ హయాంలో గంజాయి మాఫియా: పవన్‌

28 Oct, 2021 04:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర–ఒడిశా బోర్డర్‌లో గంజాయి మాఫియా రాజ్యమేలిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. దీనిపై అప్పట్లో తనకు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం పలు ట్వీట్‌లు చేశారు. ‘2018లో ఏవోబీలోని గిరిజన ప్రాంతాల్లో నేను పర్యటించాను.

అక్కడ మాఫియా రూపంలో సాగుతున్న గంజాయి వ్యాపారం గురించి స్థానికులు భయపడుతూనే ఫిర్యాదులు చేశారు. దీన్ని అరికట్టడానికి కేంద్రం అంతర్రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలి’ అని పవన్‌ కోరారు. ‘విశాఖ మన్యం నుంచి తుని వరకు ఉపాధి లేని యువకులు ఇందులో చిక్కుకుంటున్నారు. దీని వెనుక ఉండే కీలక వ్యక్తులు మాత్రం రిస్క్‌ లేకుండా సంపాదిస్తున్నారు. గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారు. ఆ పని వదిలి.. బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారు.’ అని పవన్‌ ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు