శ్రీసిటీని సందర్శించిన జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌

15 Sep, 2020 10:45 IST|Sakshi

కేవీబీపురం (చిత్తూరు జిల్లా ): జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ టగామసుయుకి శ్రీసిటీని సందర్శించారు. సోమవారం శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. శ్రీసిటీలో పెట్టుబడుల అవకాశాలు, వ్యాపార ప్రయోజనాల గురించి రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు వివరించారు. శ్రీసిటీని ‘మినీ జపాన్‌’గా పిలుస్తారని, ఆ దేశానికి చెందిన ఆటో మొబైల్, ఇంజనీరింగ్, లాజిస్టిక్, వివిధ రంగాల్లో ఖ్యాతి గడించిన 24 పరిశ్రమలు ఇక్కడ కొలువు తీరాయన్నారు. ఈ పరిశ్రమలన్నింటిలో కలిపి రూ.9,500 కోట్లు పెట్టుబడులు, సుమారు 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు.  (విజ్ఞానం పంచుకునే ‘ట్విన్నింగ్‌’)

మరిన్ని వార్తలు