శ్రీసిటీని సందర్శించిన జపాన్‌ ప్రతినిధుల బృందం 

20 Oct, 2023 04:51 IST|Sakshi

దేశంలోని అత్యుత్తమ  పారిశ్రామిక పార్కుల్లో ఒకటిగా ప్రశంస 

వరదయ్యపాళెం(తిరుపతి జిల్లా): ఒసాకాలోని జపాన్‌ ఎక్స్‌­టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (జెట్రో) డైరెక్టర్‌ జనరల్‌ ముర­హషి మసుయుకి, ఒసాకా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కమిటీ చైర్మన్‌ టొమిటా మినోరు ఆధ్వర్యంలో 23మంది ప్రముఖ జపాన్‌ వ్యాపార ప్రతినిధుల బృందం గురువారం శ్రీసిటీని సందర్శించింది. శ్రీసిటీ మౌలిక సదుపాయాలు పరిశీలించడం,  పెట్టుబడి అవకాశాలను అన్వేషించడం వీరి పర్యటన ముఖ్య ఉద్దేశం. శ్రీసిటీ ప్రెసిడెంట్‌(ఆపరేషన్స్‌)సతీష్‌ కామత్‌ వారికి స్వాగతం పలికారు.

శ్రీసిటీలో అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అభివృద్ధి, తయా­రీ యూనిట్లను నెలకొల్పడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాల గురించి శ్రీసిటీ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బోడ్గన్‌ జార్జ్‌ వివరించారు. జపాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార ప్రతినిధులు, జెట్రో, ఓసీసీఐ ఉన్నతాధికారులు  పర్యటనకు రావడంపై శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జపనీస్‌ భారీ పరిశ్రమలకు అవసరమైన సంస్థలు తమ పరిశ్రమలను ఏర్పా­టు చేసుకునేట్టు ప్రోత్సహించే అనువైన పర్యావరణ వ్య­వస్థ శ్రీసిటీలో ఉందంటూ ఆయన పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణం పై టొమిటా మినోరు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి వ్యా­పార సామర్ధ్యం, వేగవంతమైన అభివృద్ధి తమను ఎంతగా­నో ఆకట్టుకుందని తెలిపారు. శ్రీసిటీ అధికారులతో చర్చల సందర్భంగా వివిధ అంశాలపై జపాన్‌ ప్రతినిధుల బృందం ప్రశ్నలు అడిగి  తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.  ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎల­్రక్టానిక్స్‌ ఆటో విడిభాగా­లు, టెక్నికల్, టెక్స్‌టైల్స్‌ మొదలైన రంగాలకు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు