దూసుకొస్తున్న ‘జవాద్‌’ తుపాన్‌!

13 Nov, 2021 05:18 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పలు జిల్లాల్లో వర్షాలు కాస్తా తగ్గుముఖం పట్టిన తరుణంలో మరో తుపాన్‌ దూసుకొస్తోంది. గల్ఫ్‌ ఆఫ్‌ థాయిలాండ్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అండమాన్‌ సముద్రంలోకి నేడు ప్రవేశించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శనివారం దక్షిణ అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి.

ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి.. బలపడనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం మరింత బలపడి తుపాన్‌గా బలపడితే జవాద్‌ అని నామకరణం చేయనున్నారు. కచ్చితంగా రాష్ట్రంపై దీని ప్రభావం కొంత వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం మరింత బలహీన పడింది.   

మరిన్ని వార్తలు