నెగిటివ్‌ ఉన్నా చికిత్స 

20 Aug, 2020 04:22 IST|Sakshi

కోవిడ్‌ ఆస్పత్రిలో మరణాలకు ‘రమేష్‌’ నిర్వాకాలే కారణం 

ధనార్జనే ధ్యేయంగా ఆస్పత్రి యాజమాన్యం నిబంధనలన్నీ ఉల్లంఘించింది 

రూ.33.69 లక్షల మేర పన్ను బకాయిలు 

ప్రభుత్వానికి జేసీ నేతృత్వంలోని కమిటీ నివేదిక 

సాక్షి, అమరావతి: రమేష్‌ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా 10 మంది మృత్యువాత పడ్డారని విజయవాడలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ అగ్నిప్రమాద ఘటనపై జేసీ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. ధనార్జనే ధ్యేయంగా రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరించిందని తేల్చింది. ఈమేరకు కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్, సబ్‌కలెక్టర్, డీఎంహెచ్‌ఓ, రీజనల్‌ ఫైర్‌ ఆఫీసర్, ఎలక్ట్రికల్‌ ఇన్స్‌పెక్టర్‌లతో కూడిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. 

► రమేష్‌ ఆస్పత్రి అన్ని నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించింది 
► డబ్బు యావతో నియమాలు, చట్టాలను పట్టించుకోలేదు. 
► కోవిడ్‌ ఆస్పత్రిలో పదిమంది ప్రాణాలు కోల్పోవటానికి రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యానిదే బాధ్యత. 
► కోవిడ్‌ కేంద్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలూ ఉల్లంఘించింది. 
► కోవిడ్‌ సోకిందన్న అనుమానం ఉన్నవారిని,  నెగిటివ్‌ వచ్చినవారినీ  చేర్చుకున్నారు. 
► ప్రభుత్వ అనుమతి లేకుండానే, అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించకుండా స్వర్ణప్యాలెస్‌లో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించారు. 
► అనుమతి లేకున్నా ప్లాస్మా థెరపీ నిర్వహించారు. 
► అవసరం లేకున్నా ఖరీదైన రెమ్‌డెసివర్‌ మందులు ఇచ్చారు. 
► హోటల్‌కు అగ్నిమాపక పరికరాలు గానీ, నిరభ్యంతర పత్రంగాని లేవు. 
► భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేదు.  
► మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.33.69లక్షల పన్ను బకాయిలు చెల్లించలేదు.  

మరిన్ని వార్తలు