అచ్చు గుద్దినట్లు ఇద్దరిదీ ఒకే మాట

11 Oct, 2020 10:40 IST|Sakshi

జస్టిస్‌ ఎన్వీ రమణ, చంద్రబాబుల తీరు

న్యాయ మూర్తుల విభజన సమయంలో స్పష్టం

సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన సమయంలో న్యాయమూర్తుల విభజన విషయంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్‌ చంద్రబాబు నాయుడు, అదే సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎన్‌వి రమణలు ఏకతాటిపై నడిచారు. అచ్చు గుద్దినట్లు ఇద్దరూ ఒకే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల విభజనపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది. 

తెలంగాణ సీఎం వెంటనే కొలీజియంకు తన అభిప్రాయాలు చెబితే, చంద్రబాబు మాత్రం కొన్ని నెలల సమయం తీసుకుని 2017 మార్చి 21న కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు తన అభిప్రాయాన్ని చెబుతూ లేఖ రాశారు. ఆ తర్వాత ఆయన సిఫార్సు చేసిన పేర్లు, వ్యాఖ్యలు, యథాతథంగా జస్టిస్‌ ఎన్‌వి రమణ తన అభిప్రాయంగా చెబుతూ 2017 మార్చి 23న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆరుగురిపై చంద్రబాబు, ఎన్వీ రమణ వెల్లడించిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. (ఏపీ హైకోర్టుకు ‘సుప్రీం’ కమాండ్‌)

డీవీఎస్‌ సోమయాజులు  
బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా ఆయన తండ్రి డీవీ సుబ్బారావు పనిచేశారు. విశాఖ పట్టణంలో న్యాయవాదిగా పని చేసిన సోమయాజులు హైకోర్టులో ఎలాంటి ముఖ్యమైన కేసు ఫైల్‌ చేయలేదు. ఈయనపై లైంగిక వేధింపులున్నాయని సహోద్యోగులు ఫిర్యాదు చేశారు. ఇతన్ని న్యాయమూర్తిగా సిఫార్సు చేయడానికి విశాఖపట్టణం కోర్టులో ఎలాంటి గుర్తింపు పొందిన కేసు వాదించిన దాఖలాలు లేవు. 

శ్రీమతి కొంగర విజయలక్ష్మి 
మంచి న్యాయవాదిగా ఎలాంటి గుర్తింపు పొందిన దాఖలా లేవు. వృత్తి పరమైన అదనపు అర్హతలు లేవు. ఇప్పటి వరకు 194 కేసులు, 75 వకాల్తాలు మాత్రమే ఫైల్‌ చేశారు. కానీ రెండు కేసులు మాత్రమే ఆమె విషయంలో మంచివిగా చెప్పుకోవాలి. 2012-16 వరకు 91 కేసులు మాత్రమే ఫైల్‌ చేశారు. అందులోనూ ఆమె వృత్తిపరమైన ప్రాధాన్యత కన్పించ లేదు. ఇలాంటి వ్యక్తిని న్యాయమూర్తిగా ఎలా సిఫార్సు చేశారనేది ఆశ్చర్యంగా ఉంది. 

టి అమర్‌నాథ్‌ గౌడ్‌
ఈయన హైకోర్టు మాజీ న్యాయమూర్తి బంధువు. అంతకు మించి అతని వృత్తి నైపుణ్యాన్ని ఎప్పుడూ న్యాయ వ్యవస్థలతో కనబరచిన దాఖలాలు లేవు. 1545 కేసులు, 366 వకాలత్‌లు ఆయన కెరీర్‌లో ఫైల్‌ చేశారు. ఐదేళ్లలో (2012-16) 123 మాత్రమే ఫైల్‌ చేశారు. వృత్తిపరమైన దక్షత, సమగ్ర అవగాహన లోపాలున్నాయి. ఇలాంటి వ్యక్తి న్యాయమూర్తిగా సమర్థనీయం కాదు. 

అభినంద కుమార్‌ షావ్లీ
జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు ఛాంబర్‌లో జూనియర్‌గా పని చేశారు. ఆయన బదిలీ అవ్వడానికి షావ్లీనే కారణమనే ఆరోపణలున్నాయి. ఇతనికి ఎలాంటి అదనపు వృత్తి నైపుణ్యం లేదు. 1513 కేసులు, 414 వకల్తాలు మాత్రమే చేశారు. ఏదీ చెప్పుకోదగ్గది కాదు. ఐదేళ్లలో 262 కేసులు మాత్రమే ఫైల్‌ చేశాడు. ఇతను ఎంతమాత్రం సిఫార్సు చేయదగ్గవ్యక్తి కాదు.

ఎం.గంగారావు
ఆంధ్రప్రదేశ్‌ మాజీ జడ్జి జస్టిస్‌ సీవీ రాములు వద్ద పనిచేశారు. అంతకు మంచి ఎలాంటి మంచి కేసులు వాదించలేదు. ఐదేళ్లలో 123 కేసులు ఫైల్‌ చేసినా, ప్రతి దాంట్లో అతని వృత్తి నైపుణ్యం ఏమాత్రం కన్పించలేదు.

పి కేశవరావు
ఉన్నవాళ్లతో పోలిస్తే మంచి వృత్తి నైపుణ్యం ఉన్న వ్యక్తే.

మరిన్ని వార్తలు