న్యాయమూర్తులు ఆదర్శప్రాయమైన జీవితం గడపాలి

19 Oct, 2020 04:21 IST|Sakshi

వ్యవస్థలోని లోపాలపై సీఎం ఫిర్యాదు చేయొచ్చు

విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌  

గుంటూరు ఎడ్యుకేషన్‌: న్యాయమూర్తులు విధి నిర్వహణలో నీతి, నిజాయితీతో పని చేసి ఆదర్శప్రాయ జీవితాన్ని గడపాలని ఏపీ ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ అన్నారు. గుంటూరులో వైఎస్సార్‌ ఇంటెలెక్చువల్‌ ఫోరం అధ్యక్షుడు డాక్టర్‌ జి.శాంతమూర్తి అధ్యక్షతన ‘సుపరిపాలన సాధనలో న్యాయ వ్యవస్థ పాత్ర’ అంశంపై శనివారం ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్‌ నుంచి జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు రాజ్యాంగానికి మూల స్తంభాలని, వాటి మధ్య ఘర్షణ ఉండకూడదన్నారు. ఎవరో ఒక వ్యక్తి అవినీతిపరుడు అయినంత మాత్రాన వ్యవస్థ ఎప్పటికీ కళంకం కాదన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రి వ్యవస్థలో చోటు చేసుకుంటున్న లోపాలపై ఆధారాలతో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు