న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచాలి

8 May, 2022 05:01 IST|Sakshi
మాట్లాడుతున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా

నాయుడుపేట(తిరుపతి): న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా సూచించారు. శనివారం హైకోర్టు నుంచి వర్చువల్‌ విధానంలో నాయుడుపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ గొప్పతనం, ఔన్నత్యం, గౌరవం ఇనుమడించేలా వ్యవహరించాలని సూచించారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లా కోర్టుల్లో మౌలిక వసతుల కొరత ఉందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు త్వరలో చర్యలు చేపడుతామన్నారు. నెల్లూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి యామిని మాట్లాడుతూ.. జిల్లాలో 1,166 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయలక్ష్మిని న్యాయమూర్తులు, న్యాయవాదులు సన్మానించారు. నాయుడుపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి గీతావాణి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు