‘అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండండి’

18 Sep, 2020 20:10 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల సమీపంలో ఉపరితల ఆవర్తనం కోనసాగుతున్నందున ఈశాన్య బంగాళఖాతంతో రాగల రెండు రోజుల్లో అల్ఫపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ కె కన్నబాబు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల రాగల 3 రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కృష్ణానది వరద ఉధృతి దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముంద్రంలో వేటకు వెళ్లరాదని కమిషనర్‌ కన్నబాబు సూచించారు.

ఈ ప్రాంతాలకు కమిషనర్‌ పిడుగు హెచ్చరిక..
అదే విధంగా కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలకు పిడుగు కూడా పిడుగు హెచ్చరిక చేశారు. కృష్ణా జిల్లాలోని నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యాపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు, మైలవరంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గోర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించారు. వర్షం పడుతున్న సమయంలో సురక్షితమైన భవనాలల్లో ఆశ్రయం పోదాలని ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. 

రాగల 3 రోజుల పాటు వాతావరణ వివరాలు:
సెప్టెంబర్ 19న: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం.

సెప్టెంబర్ 20: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి,  కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు.మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం.

సెప్టెంబర్ 21: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా,కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం.

మరిన్ని వార్తలు