వివేకా కేసులో కేఏ పాల్‌ అనుమానాలు.. చంద్రబాబు పాత్రపై ‘కరెక్ట్‌ యాంగిల్‌’ దర్యాప్తునకు డిమాండ్‌!

14 Feb, 2023 19:26 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ:  వివేకానందరెడ్డి హత్య కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అనుమానాలు వ్యక్తం చేస్తు‍న్నారు. వివేకానంద రెడ్డి హత్యను సీబీఐ ఒక కోణంలోని ఎందుకు దర్యాప్తు చేస్తోందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబు పాత్రపైనా దర్యాపు జరగాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  వివేకానంద హత్య జరిగినప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఆ టైంలో ఆయన(చంద్రబాబు నాయుడు) ఎందుకు క్రైమ్ సీను కాపాడలేకపోయారు?. ఎందుకు వివేకానంద రెడ్డి డెడ్ బాడీని మూవ్ చేశారు? ఎందుకు హడావుడిగా పోస్టుమార్టం చేయించారు? నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని ఎందుకు సీజ్ చేయలేదు?. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయించలేదు? చంద్రబాబును ఇప్పటివరకు ఎందుకు ప్రశ్నించలేదు? అని ప్రశ్నల వర్షం గుప్పించారు కేఏ పాల్‌. 

ఈ ప్రశ్నలన్నింటికీ చంద్రబాబు సమాధానం చెప్పాలి. మీరు లేదంటే మీ నాయకులే ఈ పని చేయించారా?. 2019 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డికి చెడ్డ పేరు తీసుకురావాలని చూశారా? అని అనుమానాలు వ్యక్తం చేశారాయన. అలాగే.. సీబీఐ దర్యాప్తు కరెక్ట్ యాంగిల్ లో జరిగే వరకు ఊరుకోను అంటూ వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో అవకతవకలకు ప్రయత్నాలూ చేశారని టీడీపీ అధినేతపై కేఏ పాల్‌ మండిపడ్డారు. ‘మళ్లీ మీ ఓటు బ్యాంకు పెరగాలని చూశారు. నా బీఫాం వాడుకొని 38 మందిని  నిలబెట్టారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లను ప్రజాశాంతి పేరు మీద చంద్ర బాబు అభ్యర్థులను నిలబెట్టారని ఆరోపించారు కేఏ పాల్‌.
 

మరిన్ని వార్తలు