గ్రూపు–1 ఫలితాల్లో  కడప యువకుడి సత్తా 

9 Jul, 2022 18:38 IST|Sakshi

కడప : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన గ్రూపు–1 ఫలితాల్లో కడప ఎర్రముక్కపల్లెకు చెందిన యువకుడు భార్గవ్‌ సత్తాచాటి జిల్లా రిజిస్టార్‌ కొలువును సాధించారు. ఇతని తల్లిదండ్రులు సూర్యుడు, ఆదిలక్ష్మిలది పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లె గ్రామం. అయితే ఇతని తండ్రి ఉద్యోగరీత్యా కడపలో స్థిరపడ్డారు. భార్గవ్‌ 1 నుంచి 10వ తరగతి వరకు ఎక్కముక్కపల్లెలోని బాలవికాస్‌ స్కూల్లో చదివారు. 

ఇంటర్‌ హైదరాబాదులోని శ్రీచైతన్యలో చదివాడు. ఇంజినీరింగ్‌ను కడపలోని కేఎస్‌ఆర్‌ఎంలో పూర్తి చేశారు. హైదరాబాదులో శాప్‌ కన్సెల్టెంట్‌గా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేçస్తున్నాడు. 2018లో గ్రూపు–1 పరీక్షకు సిద్ధం అయ్యారు. ప్రిలిమనరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి ఇటీవల వెలువడిన ఫలితాల్లో జిల్లా రిజిస్ట్రార్‌ పోస్టుకు ఎంపికయ్యారు. భవిషత్తులో ఐఏఎస్‌ సాధించడమే లక్ష్యమని భార్గవ్‌  చెప్పారు. యువత పట్టుదలతో కృషి చేస్తే గ్రూపు–1, సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో విజయం సాధించవచ్చని తెలిపారు. 

మరిన్ని వార్తలు