ఆనందయ్య మందు: ఆరోపణలొద్దు.. అనుమానాలు రేపొద్దు

23 May, 2021 12:03 IST|Sakshi

ప్రభుత్వ అనుమతి వచ్చాకే మందు పంపిణీ

త్వరలోనే అనుమానాలు నివృత్తి 

ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి

సాక్షి, నెల్లూరు: ప్రభుత్వ అనుమతి వచ్చాకే ఆయుర్వేద మందు పంపిణీ చేస్తామని.. లేనిపోని ఆరోపణలు చేసి, అనుమానాలు రేపొద్దని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆనందయ్య మందుపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారన్నారు. త్వరలోనే అనుమానాలు నివృత్తి అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు రాద్దాంతం చేయొద్దని ఆయన హితవు పలికారు.

నివేదిక వచ్చాక ప్రభుత్వం ఏది చెప్తే.. అది చేస్తాం: ఆనందయ్య
తమ మందుపై నిన్న అధ్యయనం చేశారని ఆనందయ్య తెలిపారు. ఐసీఎంఆర్‌ బృందం కూడా అధ్యయనం చేయడానికి వస్తుందన్నారు. ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారు చేశామని ఆయన పేర్కొన్నారు. నివేదిక వచ్చాక ప్రభుత్వం ఏది చెప్తే.. అది చేస్తామని ఆనందయ్య తెలిపారు.

ఆయుర్వేద ఫార్మసీ నిపుణులతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భేటీ
చిత్తూరు: శ్రీనివాస మంగాపురం ఆయుర్వేద ఫార్మసీ నిపుణులతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆనందయ్య మందును ఆయుర్వేద ఫార్మసీ నిపుణులు పరిశీలించారని.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే మందు తయారీకి సిద్ధమవుతామని తెలిపారు. ఆనందయ్య వాడే వనమూలికలు శేషాచల అడవుల్లో సంవృద్ధిగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాకే విస్తృతంగా మందు తయారీకి చర్యలు చేపడతామని చెవిరెడ్డి పేర్కొన్నారు.

చదవండి: కరోనా ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం
‘ఆనందయ్య మందును నాటు మందుగా పరిగణిస్తాం’

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు