బాబు సీఎం కాకముందే నెల్లూరు మెడికల్‌ కాలేజీ ఏర్పాటు: మంత్రి కాకాణి

24 Sep, 2022 09:35 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు నోటినుంచి వచ్చేవన్నీ పచ్చి అబద్ధాలేనని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియాతో గోవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో వైద్య రంగానికి విశేషమైన కృషి చేసిన దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు హెల్త్‌ యూనివర్సిటీకి పెట్టడం సముచితమన్నారు.

దీనిపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తన హయాంలోనే పలు వైద్య కళాశాలలు నిరి్మంచినట్లు ఓ జాబితా చంద్రబాబు విడుదల చేశారని, అందులో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి మెడికల్‌ కళాశాల తామే కట్టామని చెప్పారని, ఇది పచ్చి అబద్ధమని మంత్రి స్పష్టం చేశారు. ఆ మెడికల్‌ కళాశాలకు 2013, ఏప్రిల్‌ 3న శంకుస్థాపన చేశారని, జీవోఎంఎస్‌ నం.141 ద్వారా 2013, ఆగస్టు 24న, ఏసీ సుబ్బారెడ్డి మెమోరియల్‌ మెడికల్‌ కళాశాలగా నామకరణం చేశారని మంత్రి వివరించారు. ఆ కాలేజీకి ప్రారం¿ోత్సవం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు.

కాగా, గతంలో చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నపుడు కృష్ణపట్నం పోర్టు వద్దకు వచ్చి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా అక్కడి థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు కూల్చేస్తామని చెప్పారనీ, ఆ తర్వాత కృష్ణపట్నం వచ్చి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు ప్రారంభించిన సందర్భంలో తమ వల్లే అభివృద్ధి అంటూ ప్రకటించుకున్నారని మంత్రి తెలిపారు.  నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీని ఎన్టీఆర్‌ వారసులకు అప్పగించాలన్నారు. 

మరిన్ని వార్తలు