ప్రతి నియోజకవర్గంలో కల్యాణమస్తు

31 Mar, 2021 05:36 IST|Sakshi
మాట్లాడుతున్న డాక్టర్‌ జవహర్‌రెడ్డి

జంటల నమోదు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి

టీటీడీ ఈవో డాక్టర్‌ జవహర్‌రెడ్డి

తిరుపతి ఎడ్యుకేషన్‌: టీటీడీ తలపెట్టిన ఉచిత సామూహిక వివాహాల (కల్యాణమస్తు) కార్యక్రమాన్ని కోవిడ్‌–19 నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలో మంగళవారం కల్యాణమస్తు కార్యక్రమంపై అధికారులతో ఆయన సమీక్షించారు.

మే 28న మధ్యాహ్నం 12.34 నుంచి 12.40 గంటల మధ్య సామూహిక వివాహాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిపారు. కల్యాణమస్తు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ల సహకారం కోరుతూ లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కనీసం 300 జంటలకు వివాహాలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం జంటల నమోదు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. వివాహం చేసుకునే జంటలకు రెండు గ్రాముల మంగళ సూత్రం, వస్త్రాలు, వెండి మెట్టెలు, పుస్తక ప్రసాదం, శ్రీపద్మావతి శ్రీనివాసుల ల్యామినేషన్‌ ఫోటో, భోజన ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు