థాంక్యూ సీఎం జగన్‌: కమల్‌ హాసన్‌

28 Sep, 2020 21:12 IST|Sakshi

చెనై : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. తాజాగా ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థనపై విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ స్పందించారు. బాలుకి భారత రత్న ఇవ్వాలని కోరినందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘మన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం మీరు చేసిన వినతి గౌరవమైనది. సరైనది. దీనిపై తమిళనాడులోనే కాదు దేశమంతా ఉన్న బాలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తారు.’ అంటూ పేర్కొన్నారు. చదవండి : ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వండి: సీఎం జగన్‌

కాగా, అనారోగ్యం కారణంగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 50 రోజుల క్రితం కరోనా బారినపడ్డ ఆయన.. వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తుదిశ్వాస విడిచారు. బాలు మరణంతో దేశవ్యాప్తంగా సంగీత ప్రీయులు కన్నీరు పెట్టారు. 4 దశాబ్దాలపాటు సినీ సంగీత ప్రపంచానికి సేవలు చేసిన బాలు.. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. దేశంలోని ప్రతి ఇంటికీ ఆయన పేరు సుపరిచితం. (దయచేసి దుష్ప్రచారం చేయొద్దు: ఎస్పీ చరణ్‌)

మరిన్ని వార్తలు