తిరుమల హుండీ ఆదాయంపై కమలేష్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు..

4 Feb, 2023 18:38 IST|Sakshi

తిరుమల: తిరుమల హుండీ ఆదాయంపై ఆధ్యాత్మికవేత్త కమలేష్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  హుండీలో కానుకలు వేయడం స్వార్థపూరితమన్నారు. అవి ఏ ట్రస్టుకో పూజారికో వెళ్తాయంటూ కామెంట్స్ చేశారు. కానుకలతో పుణ్యం వస్తుందనుకుంటే పొరపాటు అని నోటి దురుసు ప్రదర్శించారు.

కమలేశ్ వ్యాఖ్యలపై భక్తులు మండిపడుతున్నారు. తమ సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని ఫైర్ అయ్యారు.
చదవండి: హుండీ ఆదాయంలో రికార్డుల మోత 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు