రికార్డులకెక్కిన ‘షర్మస్‌’ క్రికెట్‌ స్టేడియం

26 May, 2021 08:17 IST|Sakshi

సాక్షి, అనంతపురం: తక్కువ ఖర్చుతో మినీ క్రికెట్‌ స్టేడియం నిర్మించవచ్చని నిరూపించాడు కణేకల్లు కుర్రాడు. తన ప్రతిభకు పదను పెట్టి ‘ఎస్‌’ ఆకారంలో మినీ క్రికెట్‌ స్టేడియం నిర్మించి ఏకంగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. వివరాల్లోకి వెళితే.. కణేకల్లులోని శ్రీ విద్యానికేతన్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మనేగర్‌ షర్మస్‌.. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో సమయాన్ని వృథా చేయకుండా మినీ క్రికెట్‌ స్టేడియం ఎలా నిర్మించాలో ఆలోచించాడు.

ప్రస్తుతమున్న స్టేడియాలకు భిన్నంగా ‘ఎస్‌’ ఆకారంలో నాలుగు ఎగ్జిట్‌లు ఏర్పాటు చేస్తూ సీటింగ్‌ కెపాసిటీ ఎక్కువ ఉండేలా ‘స్మాలెస్ట్‌ మోడల్‌ ఆఫ్‌ క్రికెట్‌ స్టేడియం’ నమూనా రూపొందించాడు. దీని కోసం రూ.20 వేల వరకు ఖర్చు చేశాడు. అనంతరం తన డెమో గురించి వివరిస్తూ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ వారికి మెయిల్‌ పంపగా.. వారు ఇటీవల దాన్ని రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు షర్మస్‌కు మెడల్, సర్టిఫికెట్‌ పంపారు. ఈ డెమాతో షర్మస్‌ పలు రికార్డ్స్‌ సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా స్టేడియం నిర్మాణ పేటెంట్‌ హక్కును కూడా పొందాడు.  మంVýæళవారం కణేకల్లులో జరిగిన కార్యక్రమంలో  రాయదుర్గం మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ ఉషారాణి, శ్రీవిద్యానికేతన్‌ స్కూల్‌ కమ్‌ కాలేజీ కరస్పాండెంట్‌ రవికుమార్‌ అభినందించారు. 

స్టేడియం ప్రత్యేకతలు ఇలా.. 
► క్రికెట్‌ రెండు వైపుల మాత్రమే(టూఎండ్స్‌) ఆడాలి. 
► షర్మస్‌ స్టేడియంను 360 డిగ్రీలో నిర్మించడం వల్ల నాలుగు వైపులా ఆడొచ్చు. 
► వర్షం వస్తే మ్యాచ్‌ ఆగినా.. వెంటనే ప్రారంభంమయ్యేలా చర్యలు. 
► వర్షపు నీరు వెళ్లేందుకు కింద గ్రాస్‌కు రంధ్రాలు ఏర్పాటు చేసి డ్రైనేజీ సిస్టమ్‌. 
► హీటింగ్‌ ప్యాడ్స్‌ ఉంచడంతో అరగంటలో గ్రౌండ్‌ అంతా డ్రై అయిపోతుంది. దీంతో వెంటనే ఆటనుప్రారంభించవచ్చు. 
► స్టేడియంలో ఎక్కువ మంది కూర్చునేలాæ ఆడియన్స్, వీఐపీ, ఫ్లేయర్స్‌ కోసం కంపార్ట్‌మెంట్స్‌ ఏర్పాటు. 
► లోయర్‌ కంపార్ట్‌మెంట్, మిడిల్‌ కంపార్ట్‌మెంట్, అప్పర్‌ కంపార్ట్‌మెంట్‌ల ఏర్పాటు. 
► మిడిల్‌ కంపార్ట్‌మెంట్‌ ఫైబర్‌ గ్లాస్‌తో ఏర్పాటు చేయడంతో పాటు వీఐపీల కోసం ఈ గ్యాలరీ రూపొందించి ఏసీ ఏర్పాటు చేసేలా ప్లాన్‌. 
► పైభాగంలో ప్రొటెక్టివ్‌ వాల్‌ నిర్మించడం వల్ల సూర్య కిరణాలు స్టేడియంలో పడవు. దీంతో ఆటకు ఎలాంటి ఇబ్బందులుండవు. 


ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారు పంపిన మెడల్, సర్టిఫికెట్‌

 ప్రపంచంలోనే ఎక్కడా లేదు
నేను రూపొందించిన స్టేడియం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. తొలుత నాకు ఎస్‌ ఆకారంలో మినీ స్టేడియం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. గూగుల్‌లో సెర్చ్‌ చేశాక ఇలాంటి స్టేడియం ఎక్కడా లేదని తెలిసింది. ఆ తర్వాతే నా మేథస్సుకు పదును పెట్టి ‘స్మాలెస్ట్‌ మోడల్‌ ఆఫ్‌ క్రికెట్‌ స్టేడియం’ నిర్మించాను. నా ప్రాజెక్ట్‌ వర్క్, స్టేడియం నమూనాను ఢిల్లీలోని ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారికి మెయిల్‌ ద్వారా పంపాను. వాస్తవానికి వారు వచ్చి విజిట్‌ చేయాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా వారు రాలేదు. దీంతో అధికారుల ఆదేశాల మేరకు నేను రోటరీ చేయించి ప్రాజెక్ట్‌ తీరును వివరిస్తూ పంపాను. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అధికారులు అంగీకరించారు. నాకు మెడల్, సర్టిఫికెట్‌ను కూడా పంపారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అధికారి మెయిల్‌లో కూడా అప్‌లోడ్‌ చేశారు. 
– మనేగర్‌ షర్మస్‌  
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు