‘సీమెన్‌ ఒప్పందంలో సీ అంటే చంద్రబాబు.. మెన్‌ అంటే..’

20 Mar, 2023 15:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ అసెంబ్లీలో స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాంపై సోమవారం కూడా చర్చ జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కన్నబాబు కీలక అంశాలను వెల్లడించారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్‌ ఓ గజదొంగల ముఠా కథ అని ఆరోపణలు చేశారు. 

కాగా, కన్నబాబు మాట్లాడుతూ.. 201-19 మధ్య చంద్రబాబు కొన్ని సినిమాలు తీశారు. స్కిల్‌ డెవలప్మెంట్‌, అమరావతి, ఫైబర్‌ నెట్‌ వంటి సినిమాలు తీశారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్‌ ఓ గజదొంగల ముఠా కథ. చంద్రబాబు అధికారం చేపట్టిన రెండు నెలల వ్యవధిలోనే రూ. 3,356 కోట్ల ప్రాజెక్ట్‌ అని మోసం చేశారు. సీమెన్స్‌ 90 శాతం పెట్టుబడి పెడుతుందని అబద్దాలు చెప్పారు. 10 శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి డబ్బులు రిలీజ్‌ చేశారు. 

ప్రాజెక్ట్‌ డీపీఆర్‌, సర్టిఫికేషన్‌ లేకుండానే ఆమోదం తెలిపారు. ఎలాంటి గ్యారెంటీ లేకుండా నిధులు మళ్లించారు. ఒప్పందం చేసుకున్న సీమెన్స్‌ కంపెనీకి కాకుండా షెల్‌ కంపెనీలకు నిధులు మళ్లించారు. దోచిన ప్రజాధనం విదేశాలకు తరలించారు. తప్పు జరినప్పుడు చంద్రబాబు ఎందుకు నోరెత్తలేదు. స్కామ్‌తో మాకు సంబంధంలేదని సీమెన్స్ కంపెనీ ప్రకటించింది. సీ అంటే చంద్రబాబు.. మెన్‌ అంటే వాళ్ల మనుషులని అర్థం. చంద్రబాబు కుదుర్చుకున్న సీమెన ఒప్పందం ఇదే. గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోనే స్కాం జరిగింది. 

చంద్రబాబు హయాంలో జరిగిన ఈ స్కాం గురించి ఎల్లో మీడియా ఒక్క మాట కూడా రాయలేదు. మేం అధికారంలోకి వచ్చాకే స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు గొప్ప చోర కళాకారుడు. తన బాబు తన స్కిల్‌ చూపించి రూ.371 కోట్లు కొట్టేశారు. ప్రజా ధనాన్ని చంద్రబాబు.. లూటీ చేశారు. అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేసే స్కిల్‌ చంద్రబాబుకు ఉంది. ఈ స్కామ్‌పై పూర్తి దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం.. పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్‌ సస్పెన్షన్‌!

మరిన్ని వార్తలు