‘రైతుల సెంటిమెంట్‌ను సీఎం జగన్‌ గౌరవించారు’

26 Feb, 2021 18:57 IST|Sakshi

కాకినాడ సెజ్‌ రైతులది న్యాయమైన పోరాటం

రైతులపై ఎస్‌ఈజెడ్‌ కేసులన్నీ ఎత్తివేస్తున్నాం

మంత్రి కురసాల కన్నబాబు వెల్లడి

సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ సెజ్‌‌(స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌) భూములను వెనక్కి ఇచ్చేయడం చారిత్రాత్మక నిర్ణయమని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పిఠాపురం వద్ద పాదయాత్ర బహిరంగ సభలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం సెజ్‌‌ భూములపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీఎం జగన్‌ దమ్మున్న నాయకుడని కొనియాడారు. జిల్లాలో శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్‌లో భూముల వ్యవహారంలో పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్య ఎదురైందన్నారు. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి రానీయలేదని, సెజ్‌‌  నుంచి ఆరు గ్రామాలను విడిచిపెట్టడం జరిగిందన్నారు. రైతుల సెంటిమెంట్‌ను సీఎం జగన్‌ గౌరవించారన్నారు.

సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వకుండా నిషేధిత భూమిలో చేర్చిన దుర్మార్గపు అలోచన చంద్రబాబుదని కన్నబాబు విమర్శించారు. 657 ఎకరాల అసైన్డ్ భూమికి పదిలక్షలు ఇవ్వాలని నిర్ణయించాడని, చేయని పాపానికి రైతులతో జైలులో బాత్‌రూమ్‌లు కడిగించారని మండిపడ్డారు. రైతులపై ఎస్‌ఈజెడ్‌ కేసులన్నీ ఎత్తివేస్తున్నామన్నారు. ఎస్‌ఈజెడ్‌ పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు. దేశంలో రొయ్యపిల్లల ఉత్పత్తి అధికంగా ఉన్న ప్రాంతం సెజ్‌ అక్వా కాలుష్య వ్యర్థాలను శుద్ధి చేసి విశాఖపట్నం వైపు తరలించి అక్కడ మళ్లీ శుద్ది చేసి సముద్రంలో విడిచి పెడతామన్నారు. 

చంద్రబాబు భూములను వెనక్కి ఇచ్చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కేసులు పెట్టి వేధించారు. కాకినాడ సెజ్‌ రైతులది న్యాయమైన పోరాటం. అమరావతిలో కొంతమంది రైతుల్లో ఈ న్యాయం లేదు. చంద్రబాబు, లోకేష్ తీవ్ర ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో ఘోరాజయం చెందారు. 38.89% శాతం పంచాయతీలు గెలుచుకున్నామని బాటా రేట్‌లా లోకేష్ చెప్తున్నారు. ఆ పంచాయతీల జాబితా మీడియాలో విడుదల చేయండి. ఢిల్లీ కాంగ్రెస్ ఎన్ని రకాలుగా వేధించినా గుండె దైర్యంతో ఎదుర్కొన్న వ్యక్తి జగన్. పెట్రోల్, డీజిల్ రేట్లు కేంద్రం పెంచుకుపోతుంటే లోకేష్ సీఎంను తిడుతున్నారు. లోకేష్‌కు  పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది’. అని కురసాల విమర్శించారు.

చదవండి: 

కాకినాడ సెజ్‌ భూముల్లో 2,180 ఎకరాలు తిరిగి రైతులకే 

చిన్నారుల ప్రతిభకు సీఎం జగన్‌ ప్రశంస

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు