వాయువ్య బంగాళాఖాతంలో​​​​​​​ అల్పపీడనం

12 Aug, 2020 18:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులపాటు వర్షాలు పడనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలోని అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నాలుగు రోజులు తీరం ప్రాంతం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

రాగల నాలుగు రోజుల వాతావరణ వివరాలు:
ఆగష్టు 13 వ తేది: విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచన.  
ఆగష్టు 14వ తేది: విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఆగష్టు 15వ తేది: విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచన.
ఆగష్టు 16వ తేది: విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి  భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు