Kapardheswara Temple History: రాక్షసుల పూజలందుకున్న కపర్దీశ్వరుడు

3 Nov, 2021 14:28 IST|Sakshi
తణుకులోని పార్వతి కపర్దీశ్వరస్వామి ఆలయం

చారిత్రక ఆధారాలు ఉన్నాయంటున్న పూర్వీకులు

Tanuku Kapardheswara Temple Story: తణుకు పట్టణంలో స్వయంభూగా వెలిసిన శివలింగం కలిగిన కపర్దీశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకోవాలంటే చరిత్ర పుటల్లోకి వెళ్లాలి. తారకాపురంగా పిలువబడే తణుకు పట్టణాన్ని తారకాసురుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడని చారిత్రక  ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో ఉన్న చెరువు వద్ద తారకాసురుడు నిత్యం పూజలు చేసేవాడని ఇదే క్రమంలో ఆయన మెడలోని లింగాన్ని కుమార స్వామి సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

సంహరణకు గురైన లింగం అయిదు ముక్కలుగా తెగిపడి పంచారామక్షేత్రాలుగా పిలువ బడుతున్న ప్రాంతాల్లో పడినట్లు చెబుతుంటారు. ఇవే పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, అరమరావతి, ద్రాక్షారామం అని పిలువబడుతున్న పంచారామక్షేత్రాలు. అయితే పంచారామ క్షేత్రాలను దర్శించిన భక్తులు తణుకులోని కపర్దీశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆలయ గోపురంపై పూర్తిగా రాక్షసుల బొమ్మలు ఉంటడం ఇక్కడ విశిష్టత.

తణుకు పట్టణంలోని పాతవూరు మున్సిపల్‌ కార్యాలయం ఆనుకుని వైష్ణవులు నిర్మించిన దేవాలయంగా పేరొందిన పార్వతి కపర్దీశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు, కల్యాణాలు, గ్రామోత్సవాలు జగరకపోవడం విశేషం. కపర్దీశ్వర స్వామి వారు నిత్యం తపస్సులోనే ఉంటారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. కార్తీకమాసం సమీపిస్తుండటంతో నవంబరు 5 నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి  సన్నాహాలు చేస్తున్నారు.


అల్లవరపు శంకరశర్మ

ఇక్కడి ఆలయానికి ప్రత్యేకత...
రాష్ట్రంలోనే కాదు ఎక్కడా లేనివిధంగా ఆలయ గోపురంపై రాక్షసుల విగ్రహాలు ఉండటం కపర్దీశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత. రాక్షసులు పూజలు అందుకున్న స్వామివారుగా ప్రసిద్ధి చెందారు. పంచారామక్షేత్రాలు వెళ్లిన వారు కపర్దీశ్వరస్వామివారికి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
– అల్లవరపు శంకరశ్మ, అర్చకుడు, తణుకు

మరిన్ని వార్తలు