బాబుతో దోస్తీ.. కాపులకు న్యాయమేది? పవన్‌ను ప్రశ్నించిన కాపు ఐక్యవేదిక

4 Jul, 2022 03:41 IST|Sakshi

కాపు, తెలగ, బలిజ కులాల డిమాండ్లపై పార్టీ వైఖరి చెప్పాలి 

సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): జనవాణి కార్యక్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్‌ కల్యాణ్‌ వైఖరినే ప్రశ్నిస్తూ కాపు ఐక్యవేదిక వినతిపత్రం అందజేసింది. కాపు రిజర్వేషన్ల అంశం సహా కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు సంబంధించి పలు డిమాండ్లపై పార్టీ తరఫున బహిరంగ ప్రకటన చేయాలని అందులో డిమాండ్‌ చేసింది.

2014లో చంద్రబాబును గెలిపించడంలో కీలకపాత్ర పోషించిన పవన్‌.. కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని, అప్పట్లో టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6 నెలల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేయలేదని ఐక్యవేదిక గుర్తుచేసింది. కాపు యువతకు టీడీపీ ప్రభుత్వం ద్వారా న్యాయం చేయించలేకపోయావంటూ కూడా తప్పుపట్టింది. వినతిపత్రం అందజేసిన తర్వాత కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్‌ రావి శ్రీనివాస్‌ ఆ వివరాలను మీడియాకు తెలిపారు. 
చదవండి👇
మా ఫ్లెక్సీలు తొలగిస్తావా?
మళ్లీ కూసిన గువ్వ

మరిన్ని వార్తలు