మృదంగ విద్వాన్‌ రామదాసు ఇకలేరు

22 Mar, 2021 14:11 IST|Sakshi

రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా వెండివీణ అందుకున్న కళాకారుడు 

విజయనగరం ‌: మృదంగ విద్వాన్, హరికథా సామ్రాట్‌గా పేరుపొందిన పడాల రామదాసు (70) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి హైదరాబాద్‌లో మృతిచెందారన్న వార్త జిల్లా సాంస్కృతిక, సాహితీ వేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన 17వ ఏట భారత రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా వెండి వీణ అందుకున్నారు. మహా రాజా సంగీత కళాశాలలో మృదంగంలో శిక్షణ పొంది, అనతికాలంలోనే పలు సంగీత కచేరీల్లో పాల్గొని పేరు తెచ్చుకున్నారు. ఆల్‌ ఇండియా రేడియోలో హరికథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు అందుకున్నాడు.

దాసన్నపేటలో 1951 జూలై 1న పైడితల్లి దానయ్యలకు రామదాసు జని్మంచారు. ఆయనకు భార్య విజయలక్షి్మ, కుమార్తె కళ్యాణి, కుమారులు తారక రామారావు, ధీరజ్‌ చంద్రలు ఉన్నారు. ఆయన ప్రోత్సాహంతోనే కుమార్తె కరాటే కళ్యాణిగా, సినీనటిగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయన మృతికి కళారంగం తీవ్ర సంతాపం తెలిపింది. కరాటే కళ్యాణి తండ్రి మృతిపై స్పందిస్తూ ఆదివారం ఫేస్‌బుక్‌ వేదికగా ఓ భావోద్వేగ ఫోస్ట్‌ పెట్టారు. 

మరిన్ని వార్తలు