ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ముగిసిన ఈడీ తనిఖీలు

3 Dec, 2022 15:47 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, దానికి అనుబంధంగా ఉన్న మెడికల్‌ కాలేజీలో ఈడీ తనిఖీలు ముగిసాయి. మొత్తం 27 గంటలపాటు జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ. గతంలో ఆస్పత్రిలో జరిగిన అవకతవకలపై ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి డైరెక్టర్లగా వ్యవహరించిన పలువుర్ని విచారించారు.

గతంలో అక్కినేని మణి, బసవరాజు, చీఫ్‌ ఫైనాన్సింగ్‌ ఆఫీసర్‌ నళినిమోహన్‌తో పాటు 25 మందిని ఈడీ విచారించింది. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రుల్తో నిధులు సొంత ఖాతాలకు మళ్లినట్లు ఈడీ గుర్తించింది. కోవిడ్‌ సమయంలోనూ అడ్వాన్స్‌ పేమెంట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయి. దొంగ ఇన్వాయిస్‌ పత్రాలతో నిధులను పక్కదారి పట్టించడంతో భవన నిర్మాణానికి సంబంధించి కోట్ల రూపాయలు గోల్‌మాల్‌పై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. 

మరిన్ని వార్తలు