ప్రభుత్వానికి కియా 10 లక్షల మాస్క్‌లు 

6 Jul, 2021 05:16 IST|Sakshi
విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్‌కు మాస్కులు అందిస్తున్న కియా ఇండియా సీఈవో కబ్‌ డాంగ్‌ లీ

సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్‌: కరోనా విపత్తుపై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా కియా ఇండియా పది లక్షల మాస్క్‌లను అందించింది. దీనికి సంబంధించిన పత్రాన్ని, శ్యాంపిల్‌ మాస్క్‌లను సోమవారం ఏపీ విపత్తుల శాఖ కార్యాలయంలో కమిషనర్‌ కె.కన్నబాబుకు కియా ఇండియా సీఈవో కబ్‌ డాంగ్‌ లీ అందించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా మాస్క్‌లను అందించడం అభినందనీయమన్నారు.

ఈ మాస్క్‌లను అన్ని జిల్లాలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కియా ఇండియా లీగల్‌ కార్పొరేట్‌ హెడ్‌ జూడ్‌ లీ, ముఖ్య సలహాదారు డాక్టర్‌ సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు