విజయవాడలో బీజేపీ నూతన కార్యాలయం

25 Oct, 2020 09:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ :  కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి  ఆదివారం ఉదయం విజయవాడలో బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. దసరా పర్వదినం సందర్భంగా సంప్రదాయ పద్దతిలో పూజా కార్యక్రమాలు అనంతరం కార్యాలయాన్ని ఆయన ఆరంభించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘కృష్ణానది తీరాన, కనకదుర్గమ్మ పాదాల చెంతన...దసరా రోజున పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించుకున్నాం. ప్రజలందరికీ మంచి జరగాలి. అందరికి విజయదశమి శుభాకాంక్షలు. ఇవాళ దుర్గమ్మను దర్శించుకుని, కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని కోరుకున్నా. చదవండి: స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు

ఏపీకి సంబంధించి పార్టీ కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తాం. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారధ్యంలో రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతుంది. కేంద్రంలో అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలి. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ. దేశంలో అత్యధిక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్న పార్టీ కూడా మాదే. పదవుల్లో ఉన్నా, లేకున్నా బీజేపీ నేతలు కుటుంబంలా కలిసి పనిచేసి పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మోదీ సారధ్యంలో పని చేస్తాం. 

సోము వీర్రాజు తొలి నుంచి పార్టీలో ఉంటూ నేడు అధ్యక్షులుగా పని చేస్తున్నారు. ప్రధాని మోదీ, నడ్డా, అమిత్‌ షా తరపున ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి’ అని అన్నారు.  ఈ కార్యక్రమంలో సునీల్ ధియోధర్, సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌, ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు, సుజనా చౌదరి, పార్టీ నేతలు మధుకర్ జీ, కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్‌ రెడ్డి, రావెల కిషోర్‌ బాబు, ఆదినారాయణరెడ్డి, గోకరాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు