హనుమంతుని జన్మస్థలం కిష్కింధే

29 May, 2021 04:08 IST|Sakshi

గోవిందానంద సరస్వతి స్వామి

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌:  హనుమంతుని జన్మస్థలం ముమ్మాటికీ కర్ణాటక పంపాక్షేత్రంలోని కిష్కింధేనని హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామి పునరుధ్ఘాటించారు. టీటీడీ కమిటీ ఇచ్చిన నివేదికలోని ప్రతి అంశాన్నీ ఆయన ప్రస్తావిస్తూ అందులో లోపాలున్నాయని ఆరోపించారు. దేశంలో ఎంతో మంది పండితులు, పీఠాధిపతులు, స్వామీజీలు, దిగ్గజ సిద్ధాంతులు ఉన్నారని వారిని సంప్రదించకుండా సబ్జెక్ట్‌పై పట్టులేని నలుగురితో కమిటీ వేసి అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం అని ఎవరికి వారు తేల్చడం తగదని తీవ్రస్థాయిలో విమర్శించారు.

శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ హనుమ జన్మస్థలంపై టీటీడీ నియమించిన కమిటీ వ్యర్థమని, 4 నెలల్లో ప్రాజెక్ట్‌ వర్క్‌లా ఇతర పుస్తకాల్లోని పేపర్లను జిరాక్స్‌ చేసి నివేదిక సమరి్పంచిందని విమర్శించారు. అందులో పొందుపరచిన శ్లోకాలు పూర్తిగా కల్పితాలేనని, నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు