స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు

25 Oct, 2020 05:03 IST|Sakshi

నిమ్మగడ్డ తనకు నచ్చినట్టు చేస్తానంటే కుదరదు: మంత్రి కొడాలి

గుడ్లవల్లేరు (గుడివాడ): రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని మంత్రి కొడాలి నాని తెలిపారు. రాజ్యాంగంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ప్రత్యేక హక్కులేమీ ఇవ్వలేదన్నారు. ఆయన ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే కుదరదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ సలహాలు, సూచనల మేరకే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

శనివారం కృష్ణా జిల్లా వేమవరంలోని కొండలమ్మను దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తాను చెప్పిందే వేదమనే దృక్పథంతో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాను ఆపేస్తే ఎన్నికలు ఆగిపోతాయని ఆయన అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నుంచి ఆరు నెలల్లో ఆయన పదవీ విరమణ చేసి హైదరాబాద్‌లోని ఇంటికి వెళ్లిపోతారని.. అప్పుడు నచ్చినవారికి చెక్కభజన చేసుకోవచ్చన్నారు. కరోనా విపత్తు సమయంలో వెయ్యి, 1,500 మందిని ఒక్కో బూత్‌కు కేటాయించకుండా కుదించాల్సిన అవసరం ఉందన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా