'చంద్రబాబుకు, డబ్బా ఛానళ్లకు ఇవి కనపడవు'

10 Nov, 2020 13:24 IST|Sakshi

కృష్ణా : పుట్టగుంట గ్రామంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి  అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు చేరువ చేశారని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆగిన  11 వేల 500 మందికి వాహన మిత్ర అందించామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని, ఆర్ధిక కష్టాలు ఉన్నా రాష్ట్రంలో పేదవారికి సంక్షేమ ఫలాలు అందాలన్న లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారని తెలిపారు. (వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీని ప్రారంభించిన సీఎం జగన్‌)

 'చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదని జూముల్లో వాగుతున్నాడు. అమ్మఒడి, విద్యా దీవెన, మన బడి నాడు నేడు, జగన్న గోరు ముద్ద వంటి పధకాలుతో వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో చదువు  ఉద్యమం తీసుకువచ్చారు. కానీ చంద్రబాబుతో పాటు డబ్బాకొట్టే చాన్నాళ్లకు ఇవి కనబడవు. 10 వేల కోట్లు  ప్రభుత్వ ఆసుపత్రులలో వసతుల కల్పనకు సీఎం కేటాయించారు. 120 కోట్లుతో గుడివాడలో జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నాం.  వైద్యానికి 1000 రూపాయల ఖర్చు పైగా అయితే దానిని ఆరోగ్యశ్రీ లోకి సీఎం తీసుకు వచ్చారు. దీని ద్వారా 2224 జబ్బులకు ఆరోగ్యశ్రీ  కింద వైద్యం  అందనుంది. కానీ ఇవేవీ గుడ్డి ఛానళ్లకి,  గుడ్డి చంద్రబాబుకి కనబడవు' అని కాడాలినాని పేర్కొన్నారు. ప్రజల మనసులు గెలిచిన వారే నాయకులవుతారని, వైఎస్‌ జగన్‌ పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. 

>
మరిన్ని వార్తలు