బీజేపీ ప్రచారం కోసమే ఎన్టీఆర్‌ను అమిత్‌ షా కలిశారు: కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

22 Aug, 2022 13:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మునుగోడు బీజేపీ సభలో​ పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, పర్యటనలో భాగంగా అమిత్‌ షా.. నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. వీరి భేటీపై ఇప్పటికే పలువురు.. పొలిటికల్‌ మీట్‌ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇక, తాజాగా ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని.. అమిత్‌ షా, జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీపై స్పందించారు. కొడాలి నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కారణాలు లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ, హోం​ మంత్రి అమిత్‌ షా ఎవరితోనూ మాట్లాడరు. బీజేపీని విస్తరించేందుకే అమిత్‌ షా.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిశారని నేను భావిస్తున్నాను. ఎన్టీఆర్‌తో దేశమంతా ప్రచారం చేయించే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రయోజనం లేదనే.. మోదీ, అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు’’ కామెంట్స్‌ చేశారు.  

ఇది కూడా చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌లో నటన భేష్‌.. జూ.ఎన్టీఆర్‌ను అభినందించిన అమిత్‌షా

మరిన్ని వార్తలు