గుడివాడ ఆర్టీసీ డిపో గ్యారెజ్‌ నిర్మాణం పూర్తి: కొడాలి నాని

30 Apr, 2023 13:55 IST|Sakshi

సాక్షి, కృష్ణ: గుడివాడ ఆర్టీసీ డిపో గ్యారెజ్‌ నిర్మాణం పూర్తి అయినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వెల్లడించారు. గ్యారెజ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కొడాలి నాని మాట్లాడుతూ.. రేపు(సోమవారం) బస్టాండ్‌ నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు  వచ్చే నెల 19న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. పులివెందుల తర్వాత రూ. 20 కోట్లతో బస్టాండ్‌ నిర్మిస్తున్నది గుడివాడలోనే అని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు టీడీపీ నేత చంద్రబాబు నాయడుపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.

ఈ మేరకు కొడాలి నాని మాట్లాడుతూ.. తండ్రి కొడుకులు మాట్లాడితే గుడివాడ మాదే అంటారు. అసలు ఏం చేశారని ఫైర్‌ అయ్యారు. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు కట్టి గుడివాడ దాహార్తిని తీర్చిన వ్యక్తి వైఎస్‌ఆర్‌ అని చెప్పారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు గుడివాడలో ఫ్లైఓవర్‌ ఎందుకు కట్టలేదని ఎద్దేవాచేశారు. సీఎం జగన్‌ చొరవతోనే ఆ పనులు మొదలు పెట్టామని చెప్పారు. మాటిమాటికి గుడివాడ నాదే అని చంద్రబాబు సిగ్గులేకుండా చెబుతాడన్నారు.

ఆనాడు వైఎస్‌ఆర్‌ చలువతో సేకరించిన 77 ఎకరాల్లోనే పేదలకు ఇళ్లు కడుతున్నాం అన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి జగన్‌ రూ. 540 కోట్లు కేటాయించాం. అలాగే చంద్రబాబు తన పాలనలో ఆర్టీసీ కార్మికులు చనిపోతే వారి కుటుంబాలను గాలి కొదిలేశాడని మండిపడ్డారు. దాదాపు 2300 ఆర్టీసీ కుటుంబాలను గాలికొదిలేసిన వ్యక్తి చంద్రబాబు. ఆయనకు తన కులానికి చెందిన వాళ్లే ముఖ్యం.

ప్యాకేజ్‌ పడేస్తే పక్క రాష్ట్రం నుంచి వాళ్లే కావాలి అంటూ రజనీ కాంత్‌ని  ఉద్దేశించి చురకలంటించారు. అయినా రజనీకాంత్‌ మూడు రోజులు షూటింగ్‌ చేస్తే నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటాడని విమర్శించారు. ఈ చంద్రబాబు మంగళవారం వస్తే కనబడడని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి వెళ్తాడని అన్నారు. అసలు ఏ విషయం పరంగా చూసిన జగన్‌కు చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ కొడాలి నాని ఘాటుగా విమర్శలు గుప్పించారు.

(చదవండి: ‘పవన్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు రజినీకాంత్‌ రంగంలోకి!’)

 
 

మరిన్ని వార్తలు