ఆ 24 సీట్లు కోసమే ప్రతిపక్షాలు పోరాడాలి: కొడాలి నాని

11 May, 2022 13:58 IST|Sakshi
కొడాలి నాని ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, కృష్ణా జిల్లా: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడ 22వ వార్డులో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే కొడాలి నాని​, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పొల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో కొడాలి నాని మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరుస్తున్న వ్యకి​ ప్రస్తుతం మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు తన కొడుకు, మనవడిని ఇంగ్లీష్‌ మీడియం చదివిస్తుంటే.. పేద ప్రజలకు ఇంగ్లీష్‌ మీడియం అందకుండా కోర్టులకు వెళ్తున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రజల్ని దోచుకుతిన్నాడు. జగన్ రాజకీయాల్లో లేకపోతే ఇళ్లు లేక పేదలు అల్లాడుతుండేవారు. డిసెంబర్ 21 ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం రోజున గుడివాడలో టిడ్కో ఇళ్ళు పంపిణీ చేస్తాం. నియోజకవర్గంలో ఇళ్ళు లేవని ఒక్క పేదవాడు నన్ను అడిగినా 2024లో ఎన్నికల్లో పోటీ చేయను. నాలుగు లక్షల మంది వాలంటీర్లతో ప్రజలకు పాలన అందుబాటులోకి తెచ్చాం. గుడివాడలో ముఖ్య సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కనీవినీ ఎరుగని విధంగా గుడివాడను అభివృద్ధి చేస్తాను. జగన్‌మోహన్ రెడ్డి జీవించి ఉన్నంత కాలం మనం ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలి. అందుకోసం పేదలందరూ ఒకే వేదిక మీదకు రావాలని' ఎమ్మెల్యే కొడాలి నాని కోరారు. 

ఇరవై నాలుగు సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలి
పని పాటాలేని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొడతామని కొడాలి నాని అన్నారు. 'పవన్ చెప్పే తీరులో ఎటువంటి లాజిక్ లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేక ఓటు లేదు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క దాన్ని అమలు చేసిన మాకు, మా ప్రభుత్వానికి అనుకూల ఓటు మాత్రమే ఉంది. ప్రజల ఇతర అవసరాలు తెలుసుకునేందుకే గడపగడపకు మన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా.. విడిగా పోటీచేసిన, మాకు ఊడేది ఏమీ లేదు. మిగిలిన ఇరవై నాలుగు సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలి. మా 151సీట్లు పక్కగా తిరిగి మాకు వస్తాయి' అని కొడాలి నాని అన్నారు.

చదవండి: (జనసేనకు ఝలక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన మాదాసు గంగాధరం)

మరిన్ని వార్తలు