దొడ్డిగట్టు.. కాసులు పట్టు! 

30 May, 2022 12:29 IST|Sakshi

కొల్లేరు నీటి కుంటల్లో అక్రమ సాగు

అటవీ అధికారులకు మామూళ్లు !

చెరువుల ధ్వంసానికి డీఎఫ్‌ఓ ఆదేశం

ఏలూరు రూరల్‌ : కొల్లేరు దొడ్డిగట్లు.. అక్రమ చెరువులకు అడ్డాగా మారాయి. కొల్లేరులోని నీటికుంటను మత్స్యకారులు దొడ్డిగట్టుగా పిలు స్తారు. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా మ త్స్యకారులు చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నా రు. ఇందుకు అటవీశాఖ అధికారులకు సొమ్ము లు ముట్టజెబుతున్నారు. సెక్షన్‌ ఆఫీసర్‌ నుంచి గార్డు వరకూ దొడ్డిగట్ల ద్వారా ఏడాదికి రూ.కోటికిపైగా మామూళ్లు అందుతున్నట్టు అంచనా.   

సుమారు 30 వేల ఎకరాల్లో..  
2007లో అధికారులు కొల్లేరు ప్రక్షాళన చేపట్టిన సమయంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 75 వేల ఎకరాల విస్తీర్ణంలో వందలాది చెరువు గట్లను ధ్వంసం చేశారు. కాలక్రమేణ వరదలు, వర్షాలకు ఈ చెరువు గట్లు కుంగి దొడ్డిగట్లుగా మారాయి. వీటిని పటిష్టపరిచి కొందరు చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అభయారణ్యంలో సుమారు 30 వేల ఎకరాల్లో దొడ్డిగట్లు వెలిశాయి.  

ఎకరానికి రూ.3 వేల వరకూ.. 
దొడ్డిగట్లలో చేపల సాగును సెక్షన్‌ ఆఫీసర్లు, గా ర్డులు అడ్డుకుంటున్నారు. కేసులు పెడతామని, గట్లు కొట్టేస్తామని మత్స్యకారులను బెదిరిస్తున్నారు. దీంతో మత్స్యకారులు అధికారులకు సొమ్ములు ముట్టజెబుతున్నారు. ఇదే అదనుగా సెక్షన్‌ ఆఫీసర్లు, గార్డులు కలిసి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పెదపాడు సెక్షన్‌ పరిధిలో శ్రీపర్రు, కలకుర్రు, మానూరులో దొడ్డిగట్లలో సాగు చేస్తున్న మత్స్యకారుల నుంచి ఎకరాకు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సెక్షన్‌ పరిధిలో సుమారు 6 వేల ఎకరాల్లో చేపల సాగు ఉంది. అలాగే నిడమర్రు, ఏలూరు, భీమడోలు పరిధిలో సుమారు 24 వేల ఎకరాల దొడ్డిగట్లలో సాగు చేస్తున్న మత్స్యకారుల నుంచి అధికారులు సుమారు రూ.కోటి వరకూ వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో కొంత మొత్తం ఉన్నతాధికారులకు సైతం చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.  

దొడ్డిగట్లు కొట్టేస్తాం  
దొడ్డిగట్లలో చేపల సాగు ను అడ్డుకుంటాం. ఏలూ రు మండలం కొక్కిరాయిలంక వెనక అక్రమ చెరు వు తవ్వకాలను అడ్డుకున్నాం. ఈ ప్రాంతంలో దొడ్డిగట్లను చేపల చెరువులుగా మార్చి సాగు చేస్తున్నట్టు గుర్తించాం. వెంటనే పూర్తిస్థాయిలో ధ్వంసం చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు రేంజర్లు, సెక్షన్‌ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఏలూరు, కైకలూరు రేంజర్ల పర్యవేక్షణలో దొడ్డిగట్లను ధ్వంసం చేయిస్తాం.  
–సెల్వం, డీఎఫ్‌ఓ 

హక్కులు కాపాడాలి  
కొల్లేరులో సహజ సిద్ధంగా ఏర్పడ్డ దొడ్డిగట్లలో చేపలు పట్టుకునే హక్కు మత్స్యకారులకు ఉంది. వేసవిలో వీటిని పట్టుకుని అమ్ముకుంటారు. దొడ్డిగట్లలో చేపల సాగు చాలా కష్టం. కొల్లేరుకు వరద వస్తే దొడ్డిగట్లు మునిగి మత్స్యకారులు నష్టపోతారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెగ్యులేటర్ల నిర్మాణం పూర్తి చేయగానే కొల్లేరు మొత్తం నిండుకుండలా మారిపోతుంది. అప్పుడు మ త్స్యకారులు సంప్రదాయ చేపల వేటతో జీవనం సాగించవచ్చు. 
–పెన్మెత్స శ్రీనివాసరాజు, ఎంపీపీ, ఏలూరు 

మరిన్ని వార్తలు