‘కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అసైన్డ్‌ భూములు కొనుగోలు చేశారు’

5 Jul, 2021 18:35 IST|Sakshi

సాక్షి, గుంటూరు: కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అమరావతిలో అసైన్డ్‌ భూములు కొనుగోలు చేశారని ఆయన దగ్గర పనిచేసిన ప్రసాద్‌ తెలిపారు. బడాబాబులకు అసైన్డ్‌ భూములు కొనిపెట్టారని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్‌ బినామీ కొల్లి శివరామకు కూడా భారీ స్థాయిలో భూములు కొని పెట్టారని తెలిపారు. దళిత రైతులు ఎదురు తిరుగుతారేమోనన్న భయంతో అసెన్డ్‌భూముల కొనుగోళ్ల వ్యవహారం మొత్తాన్ని వీడియో చేయించారన్నారు.

2015 జనవరి 1న భూ సమీకరణ మొదలు పెట్టగా, 2016 ఫిబ్రవరి వరకు అసైన్డ్‌ భూములను ల్యాండ్‌పూలింగ్‌కు తీసుకోలేదని వెల్లడించారు. ఈ ఏడాది కాలంలో అమరావతిలో అసెన్డ్‌భూములను పెద్దలు కొనేశారని చెప్పారు. టీడీపీ నేతలందరితోనూ కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డికి పరిచయాలున్నాయని, అలానే ఎవరెంత కొనుగోలు చేశారో చిట్టా అంతా బ్రహ్మానందరెడ్డి వద్ద ఉందన్నారు. అధికారులకు లంచాలు ఇచ్చి అసైన్డ్‌ భూములు రిజిస్ట్రేషన్‌ చేయడానికి యత్నించారని, మాకు తెలియకుండానే మా పేరుతో ఆస్తుల్ని రిజిస్ట్రేషన్‌ చేయించారన్నారు. ఇదే విషయాన్ని సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు