Kommu Konam Fish: జాలర్ల కష్టానికి దక్కిన ప్రతిఫలం

21 Apr, 2022 14:04 IST|Sakshi
రూ.40వేలు పలికిన 350 కేజీల కొమ్ము కోనం చేప

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): వేట విరామం ప్రకటించారు. దాదాపు రెండునెలల పాటు మత్స్యసంపద అంతంత మాత్రమే. రొయ్యలు.. చేపలు.. పీతలు.. ఇలా అన్ని రకాల మత్స్యసంపద కరువైన రోజులివి. సముద్రం చేప దొరకాలంటే కష్టమైన రోజులివి. బుధవారం మాత్రం మత్స్యకారులకు కొమ్ముకోనం చేప కొమ్ము కాసింది. అదేంటి.. వేట విరామంలో చేపలు ఎలా వస్తున్నాయనుకుంటున్నారా.. తెరపడవలపై పలువురు జాలర్లు రోజంతా కష్టపడితే కొమ్ముకోనం చేపలు విరివిగా పడతున్నాయి. 

వాస్తవానికి వేట విరామంలో ఇంజన్‌ బోట్లు (మరపడవలు), ఇంజన్‌తో కూడిన వేట పడవలు సముద్రంలోకి వెళ్లడం నిషిద్ధం. కానీ తెర పడవల మీద వేటకు వెళ్లవచ్చు. వీరి కష్టానికి ఎంతో కొంత ప్రతిఫలం దొరుకుతుంది. బుధవారం విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో కొమ్ముకోనం చేపలు సందడి చేశాయి. దాదాపు 400 చేపలు జాలర్లకు చిక్కాయి. వీటిలో ఒకచేప 350 కిలోలకుపైగా బరువుండగా 14 చేపలు వంద కిలోలకుపైన ఉన్నాయి. వీటికి రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు ధర పలికింది. చేపల్ని దక్కించుకున్న పాటదారుడు వెంటనే ముక్కలు చేసుకుని తీసుకెళ్లారు. (క్లిక్: అంతరిక్షంలో అద్భుతం.. ఒకే వరుసలో నాలుగు గ్రహాలు)

మరిన్ని వార్తలు