సీసాల పడవ.. భలే ఉందిరా బుల్లోడా!

21 Jul, 2022 13:03 IST|Sakshi

అమలాపురం రూరల్‌: వరద నీటిలో వెళ్లేందుకు బాధితులు తాత్కాలికంగా అరటి బొందలు, కలపతో తెప్పలు తయారు చేసుకోవడం పరిపాటి. కోనసీమ జిల్లా అమలాపురం రూరల్‌ మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామ శివారు దొమ్మేటివారిపాలెంలో వరద నీటిలో చిన్న పిల్లల కోసం వారి కుటుంబీకులు ఖాళీ డ్రింక్‌ బాటిల్స్‌తో చిన్న తెప్పలను తయారు చేశారు. వాటిపై పిల్లలు కూర్చుని వీధుల్లోనే తిరుగుతున్నారు.
 

వీడని ముంపు 
గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో కొన్ని లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. అయితే కొన్ని గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. వివిధ పనులపై స్థానికులు పడవల పైనే రాకపోకలు సాగిస్తున్నారు.


మరోపక్క ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. ప్రజారోగ్యం, పారిశుధ్యం తదితర అంశాలపై దృష్టి సారించింది. 

వరదల కారణంగా పొలాలతో అన్ని ప్రాంతాలు నీట మునగిపోవడంతో పశువుల మేతకు ఇబ్బంది వచ్చింది. దీంతో రైతులు పడవలపైనే పశువుల కోసం గడ్డిని తరలిస్తున్నారు.  (క్లిక్: నిర్విఘ్నంగా.. నిర్విరామంగా.. అర్ధరాత్రి నుంచే వంటావార్పు)

మరిన్ని వార్తలు