స‘లక్ష’ణంగా త్రివర్ణ శోభితం! 

20 Jan, 2023 12:12 IST|Sakshi

ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులు అద్ది ఔరా అనిపిస్తున్నాడు. పొడవైన బాసుమతి రకం బియ్యాన్ని ఎంచుకుని వాటికి రంగులు దిద్ది.. వాటిని చార్టులపై అంటించాడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్రశ్రీహరి(రామం).

గతంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెలా 15 రోజుల్లో 3 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులను అద్ది రికార్డు సృష్టించాడు. తాజాగా సుమారు రెండు నెలల్లో 5 లక్షల బియ్యం గింజలపై రంగులు అద్దడం ద్వారా తన రికార్డును తానే బ్రేక్‌ చేసినట్టు చెబుతున్నాడు. ఇప్పటికే ఈ అంశం పలు రికార్డు సంస్థల దృష్టికి వెళ్లినట్టు తెలిపాడు.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు