'ఒక్క మాటతో 24 మంది రాజీనామా చేశారు.. అది మా కమిట్మెంట్‌'

9 Apr, 2022 17:57 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: మంత్రి పదవులపై నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రిదేనని ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్‌ ఎటువంటి పని చెప్పినా చేయడానికి నేను సిద్ధం. ప్రభుత్వంలోకి తీసుకుంటారా.. పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా అనేది సీఎం ఇష్టం. ఆయన మాటకు మేమంతా కట్టుబడి ఉంటాం. ఆయన చెప్పగానే 24 మంది మంత్రుల రాజీనామా చేశారు. అది మా కమిట్మెంట్‌. నాకు మంత్రి పదవి వస్తుందా లేదా అనేది 11వ తేదీన తెలుస్తుంది. నాకు ఏ బాధ్యత అప్పజెప్పినా జగనన్న సైనికుడిలా పనిచేస్తానని' ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు స్పష్టం చేశారు.

చదవండి: (ఏపీ నూతన కేబినెట్‌ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు) 

మరిన్ని వార్తలు